Actress Sunaina About 'Regina' Movie - Sakshi
Sakshi News home page

Actress Sunaina: 'రెజీనా' ఓ డిఫరెంట్ సినిమా: సునయన

Jun 22 2023 9:18 AM | Updated on Jun 22 2023 10:07 AM

Actress Sunaina About Regina Movie - Sakshi

దక్షిణాదిలో 18 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తున్న భామ సునయన. తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ.. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన రెజీనా చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

'నా కుటుంబం, తమిళ ప్రేక్షకుల నుంచి ప్రేమ, ఆదరణ చాలానే లభించాయి. అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెజీనా చిత్రం నా కెరీర్‌లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2018లో నేన ఏం చేయాలన్న దాని గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఏం అనిపిస్తే అదే చేయాలని ఫిక్సయ్యాను. ఆ తర‍్వాత మంచి ఆలోచనాత్మక సినిమాలని ఎంపిక చేసుకోవడం ప్రారంభించను.' 

'ఈ క్రమంలోనే అలా ఎలా నటించడానికి అంగీకరించావని అన్నారు. ఆ సమయంలో చాలా మందికి వెబ్‌ సీరీస్‌ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అందుకే చాలా మంది అటువైపు దృష్టి సారించలేదని, అయితే వెబ్‌ సీరీస్‌లో నటించడం నాకు నచ్చింది. అందుకే నచ్చింది చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత తమిళంలో సిల్లుక్కరు పట్టి, తెలుగులో రాజరాజ చోళ లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాను. ఈ 'రెజీనా' చిత్రం కూడా అలాంటిదే' అని సునయన చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement