ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చిత్రాలు విభిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంటాయి. అలా థియేటర్లలోకి రాకముందే పలు వివాదాలు ఎదుర్కొని ఆపై ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చిన ఓ తమిళ డబ్బింగ్ మూవీని అక్కినేని కోడలు చూసింది. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చేసింది. అమ్మాయిలు కచ్చితంగా చూడాలని చెప్పి రికమెండ్ కూడా చేసింది.
'బ్యాడ్ గర్ల్.. నన్ను నవ్వించింది, ఏడిపించింది. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. అందరూ చూడాల్సిన చిత్రం. ముఖ్యంగా అమ్మాయిలకు దీన్నికచ్చితంగా చూడమని చెబుతున్నాను. ఇది మనకోసం.. వర్ష భరత్, అంజలి శివరామన్ని అభినందించాలి' అని శోభిత తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన 'బ్యాడ్ గర్ల్'.. ఓటీటీ రివ్యూ)
'బ్యాడ్ గర్ల్' సినిమా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో తీసిన బోల్డ్ సినిమా. వెట్రిమారన్ దగ్గర సహాయకురాలిగా పనిచేసిన వర్ష భరత్ అనే అమ్మాయి.. దర్శకురాలిగా తీసిన తొలి మూవీ ఇది. వెట్రిమారన్‌తో పాటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. దీన్ని నిర్మించారు. థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. గతవారం హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి ఉంది.
'బ్యాడ్ గర్ల్' విషయానికొస్తే.. మిడిల్ క్లాస్ టీనేజ్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). ఓ బాయ్ ఫ్రెండ్, చిన్న ఇల్లు ఉంటే చాలని అనుకుంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ (హ్రిదు హరూన్), కాలేజీలో అర్జున్ (శశాంక్), ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్ (టీజే అరుణాచలం)తో రిలేషన్‌లో ఉంటుంది. వీటిలో ఏ బంధమూ ఎక్కువరోజులు నిలబడదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి, అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం 'బ్యాడ్ గర్ల్' అని ముద్ర వేస్తుంది. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు రమ్య ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్' కోసం వస్తున్న బాయ్ ఫ్రెండ్.. రష్మిక కోసం విజయ్)


