
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) దంపతులు దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా తొలిసారి దివాళీని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చైతూ సతీమణి శోభిత ధూలిపాల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. గతేడాది డిసెంబర్‌లో చైతూ-శోభిత వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేశ్ కూడా పాల్గొన్నారు.
కాగా.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) గతేడాది తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్‌లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.