రాధిక కొత్త ప్రయాణం

Actress Radhika in a French film - Sakshi

కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్‌ నటిగా, నిర్మాతగా చిత్రసీమలో రాధిక ఎన్నో విజయాలు చూశారు. ఇటు బుల్లితెరపైనా నటిగా, నిర్మాతగా ఆమె కెరీర్‌ హిట్‌. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కిళక్కే పోగుమ్‌ రైల్‌’ (1978) ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు రాధిక. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు.

ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న రాధిక ఫ్రెంచ్‌లో తొలి చిత్రం అంగీకరించారు. ‘‘నా సినిమా కెరీర్‌లో కొత్త ప్రయాణం ఆరంభించాను. ఫ్రెంచ్‌ సినిమాలో నటించడం నాకో కొత్త అనుభూతి. ఈ  కొత్త ప్రయాణానికి ప్రోత్సహించిన శరత్‌కుమార్‌ (రాధిక భర్త), రేయాన్‌ (కుమార్తె)లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాధిక. ఈ చిత్రానికి లారెన్స్‌ వాలిన్‌ దర్శకుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top