మీకు నయన్‌ సూపర్‌స్టార్‌ గానే తెలుసు..: విఘ్నేష్‌ శివన్‌

Actress Nayanthara Praised by Vignesh Shivan - Sakshi

నటి నయనతారను ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ మరోసారి పొగడ్తల్లో ముంచేశారు. ఆయన నయనతారను పొగడటం కొత్త ఏమీ కాదుగా అంటారా..? అది నిజమే. అయితే ఈసారి సందర్భం ఏమిటంటే గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల జంట ఎట్టకేలకు ఈ ఏడాది జూన్‌ 9న పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుక అంతా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఆధ్వర్యంలోనే జరిగిందంటారు.

సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. అయితే ఈ పెళ్లి తంతు ఖర్చు అంతా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భరించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దీని ఓటీటీ ప్రచార హక్కుల కోసం ఆ సంస్థ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేష్‌ శివన్‌లు పెళ్లి పంక్షన్‌ను బియాండ్‌ ద ఫెయిరీ టేల్‌ పేరుతో నెట్‌ప్లిక్స్‌ త్వరలో ప్రచారం చేయడానికి సిద్ధమైంది.

అందులో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల ప్రేమ, పెళ్లి గురించి తమ భావాలను వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ప్రోమో శనివారం విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. దీనిని విఘ్నేష్‌ శివన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో విఘ్నేష్‌ శివన్‌ పేర్కొంటూ నయనతార మీకు సూపర్‌స్టార్‌గానే తెలిసి ఉంటుందని, వ్యక్తిగతంగా తెలిసి ఉండదని పేర్కొన్నారు.

తన అలవాట్లు అన్ని మార్చుకున్న అద్భుతమైన ప్రేమకథ ఉన్న మై బంగారం ఈ నయనతార బియాండ్‌ ద ఫెయిరీ టేల్‌ త్వరలో నెట్‌ప్లిక్స్‌లో ప్రచారం కానుందన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన నటి నయనతార అని, అయితే చేపట్టిన పనికి 100 శాతం శ్రమించాలని భావించే సాధారణ మహిళని తెలిపారు. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top