కుల విభేదాలకు కారణం రాజకీయ నాయకులే : నటుడు శరత్‌ కుమార్‌

Actor Sarath Kumar Talk About Tamil Kudimagan Movie - Sakshi

తమిళ సినిమా: నటుడు, దర్శకుడు చేరన్‌ చాలా గ్యాప్‌ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం తమిళ్‌ క్కుడిమగన్‌. నటి శ్రీ ప్రియాంక, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌, లాల్‌, వేల రామమూర్తి, దీపిక్ష, అరుళ్‌ దాస్‌, రవి మరియా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై ఇస్సక్కీ కార్వానన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శ్యావ్‌. సీఎస్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటుడు శరత్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా దర్శకుడు అమీర్‌, తంగర్‌ బచ్చన్‌, మారి సెల్వరాజ్‌, నటుడు పొన్‌ వన్నన్‌ తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత ఇస్సక్కీ కార్వానన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో భగ్గుమంటున్న కుల చిచ్చు ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం తమిళ్‌ క్కుడిమగన్‌ అని చెప్పారు. ఇది చిత్రం కాదు పాఠం అని పేర్కొన్నారు.

నటుడు శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ కుల విభేదాలను కారణం రాజకియాలేనని పేర్కొన్నారు. మనిషి పుట్టినప్పుడు తన కులమేమిటన్నది తెలియదన్నారు. అదేవిధంగా పాఠశాల దేశంలో, కళాశాల దేశంలోనూ అందరూ కలిసి మెలిసి ఆడుకుంటారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత కుల, మత భేదాలు తలకెక్కుతాయన్నారు. కుల వివక్షత రూపుమాపడానికి వేరే రాజకీయం ఉందన్నారు. అదే సమానత్వం అనీ దాని కోసం అందరూ పాటు పడాలని అన్నారు. తాను రాజకీయ నాయకుడినేననీ, సమానత్వవం కోసమే తాను భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయని శరత్‌ కుమార్‌ అన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top