కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా భర్త.. వీడియో వైరల్‌ | Actor Riteish Deshmukh Breaks Down At Event Of Father Vilasrao Deshmukh | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా భర్త..

Feb 19 2024 9:13 AM | Updated on Feb 19 2024 9:30 AM

Actor Riteish Deshmukh Breaks Down At Event Of Vilasrao Deshmukh - Sakshi

మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్‌ అయ్యారు. తన దివంగత తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి దివంగత కాంగ్రెస్‌ నేత విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో రితీష్‌ తాజాగా మాట్లాడారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. నాన్న చనిపోయి 12 ఏళ్లు అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఆ సమయంలో వెంటనే ఆయన అన్నయ్య, లాతూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమిత్‌ దేశ్‌ముఖ్‌ ఓదార్చారు.

'సాహెబ్ (విలాస్‌రావ్ దేశ్‌ముఖ్) మనల్ని విడిచిపెట్టి పన్నెండేళ్లు గడిచాయి. ఆయన లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉంటుంది. అతను ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా  ప్రకాశిస్తాడు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదు. అతను ప్రజల కోసం బలంగా నిలబడ్డాడు. తద్వారా ఇప్పుడు మేము, మా పిల్లలు కూడా నిలువెత్తు ఆవశ్యకతను అనుభవిస్తున్నాం. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అది ఈ స్టేజీపైన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ   వెలుగుల రూపంలో ప్రకాశవంతంగా కనిపింస్తుంది.' అని రితీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

2012లో హీరోయిన్‌ జెనీలియాను బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చివరిగా వేద్‌ అనే చిత్రంలో జంటగా కనిపించారు.తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘మజిలీ’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది.

మే 26, 1945న లాతూర్‌లో జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆగస్టు 14, 2012న మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement