'పుష్ప: ది రూల్‌' సినిమా షూటింగ్‌లో కేశవ ఎంట్రీ..! | Sakshi
Sakshi News home page

కేశవ విషయంలో 'పుష్ప' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

Published Fri, Feb 2 2024 10:15 AM

Actor Jagadeesh Prathap Bandari Joins Pushpa Movie Shooting - Sakshi

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు కేశవగా నటించిన  బండారు ప్రతాప్‌ అలియాస్‌ జగదీశ్‌(31) అరెస్ట్‌ కావడంతో పుష్ప-2 షూటింగ్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. హైదరాబాద్‌లో ఒక యువతిని బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారకుడైనట్లు ఆధారాలు లభించడంతో గతేడాదిలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పుష్ప పార్ట్‌-2 లో కేశవ పాత్ర చాలా కీలకం.. అతను జైలుకు వెళ్లడంతో చిత్ర యూనిట్‌ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా విడుదల విషయంలో జాప్యం ఎదరౌతుందేమో అనే వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా జగదీష్‌కు బెయిల్ వచ్చిందని నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఆయన జైలు నుంచి రాగానే  వెంటనే 'పుష్ప 2' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడట. జగదీష్‌, అల్లు అర్జున్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారట. పార్ట్‌-1 కంటే పుష్ప ది రూల్‌లోనే అల్లు అర్జున్‌తో జగదీష్‌ సీన్స్‌ ఎక్కువగా ఉన్నాయట అందుకే అతన్ని రిప్లేస్‌ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని తెలస్తోంది. హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌లో గంగమ్మ జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. జగదీశ్‌కు బెయిల్‌ వచ్చేందకు పుష్ప చిత్ర యూనిట్‌ ఎక్కువగా సహకరించినట్లు టాక్‌. కానీ జగదీశ్‌ బెయిల్‌ విషయంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ స్పందించిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్లే 2024 ఆగష్టు 15న విడుదల చేస్తామని వారు ప్రకటించారు.

జగదీశ్‌ జైలుకు ఎందుకు వెళ్లాడు..?
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన జగదీశ్‌ చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. పుష్ప సినిమాకు ముందు రోజుల్లో నుంచే ఒక యువతితో అతను సన్నిహితంగా ఉండేవాడు. డైరెక్టర్‌ సుకుమార్‌ ఇచ్చిన అవకాశంతో కేశవగా పాపులర్‌ అయ్యాడు. పుష్ప సినిమాలో కేశవ పాత్రతో గుర్తింపు వచ్చిన క్రమంలో ఆ యువతికి దూరంగా ఉంటూ వచ్చాడు. అప్పటికే ఆమెకు వివాహమై భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఇద్దరి మధ్య పలుమార్లు వివాహ విషయమై గొడవలు జరిగాయి. ఆమె మరో వ్యక్తితో కలసి ఉండగా రహస్యంగా ఫొటోలు తీశాడు. ఇక నుంచి తనతో దూరంగా ఉండాలని కోరాడు. లేదంటే వాటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. దీనంతటికి కారణం జగదీశ్‌నే అని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement