30 ఇయర్స్‌ అంటోన్న బాలాదిత్య

Actor Baladitya completes 30 years in the movies - Sakshi

‘‘నా  30 ఏళ్ల ప్రయాణంలో ఎందరో గొప్ప దర్శక–నిర్మాతలతో, మహానటులతో పని చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాలాదిత్య. ‘ఎదురింటి మొగుడు పక్కింటిపెళ్ళాం’తో బాలనటుడిగా పరిచయమైన బాలాదిత్య ‘అన్న’, ‘లిటిల్‌ సోల్జర్స్‌’, ‘బంగారు బుల్లోడు’, ‘హిట్లర్‌’ వంటి చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాడు. ‘చంటిగాడు’తో హీరోగా పరిచయం అయ్యారు.

నటుడిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలాదిత్య మాట్లాడుతూ – ‘‘ఎదురింటి మొగుడు పక్కింటిపెళ్ళాం’ చిత్రంలో తొలిసారి చైల్డ్‌ ఆర్టిస్టుగా చేశాను. దివంగత ప్రముఖ దర్శకులు దాసరిగారు  ఈ సినిమాకి క్లాప్‌ ఇచ్చారు (13–6–1991). అలా నటుణ్ణి అయి 30 ఏళ్లయింది. ఈ చిత్రంలో ‘స్టాంప్‌గాడి’గా పేరు పొందిన నేను ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా, వ్యాఖ్యాతగానూ మారాను. సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ప్రస్తుతం ‘పొలిమేర’, ‘విరహం’ చిత్రాలతో పాటు ఓ పీరియాడికల్‌ మూవీ చేస్తున్నారు బాలాదిత్య.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top