
ఇంత డబ్బు పోగొట్టుకున్నాడని నాకు అప్పటిదాకా తెలీదు. ఆయన గురించి అంతా తెలిశాక పూరీగారినే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా..
Ajay Ghosh About Puri jagannadh: ఇడియట్, పోకిరి, దేశముదురు, నేనింతే, ఏక్ నిరంజన్, టెంపర్, లోఫర్, రోగ్.. ఇవన్నీ తిట్లు కాదు.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాలు. ఆయన తీసిన సినిమాలే కాదు దాని టైటిల్స్ కూడా ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు తీసిన ఆయన కెరీర్‌లో ఎన్ని హిట్లు ఉన్నాయో అంతే ఫ్లాపులున్నాయి. ప్రస్తుతం ఆయన లైగర్ సినిమా తీస్తున్నాడు.
ఇదిలా ఉంటే నటుడు అజయ్ ఘోష్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పూరీ చేతిపై జీవితంలో నాట్ పర్మినెంట్ (ఏది శాశ్వతం కాదు) అని ఒక పచ్చబొట్టు ఉంటుంది. నేను ఆయనతో సినిమా చేస్తున్నానంటే నా కొడుకే నమ్మలేదు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంపించాక అది చూసి వాడు ఓ మాటన్నాడు. నువ్వు గొప్ప తాత్వికుడితో పని చేస్తున్నావు. ఇండస్ట్రీలో కొన్ని వందల కోట్లు పోగొట్టుకుని నాలుగు రోడ్ల కూడలి మధ్య నిలబడి తిరిగి లేచిన తరంగంతో పని చేస్తున్నావ్ అన్నాడు. ఇంత డబ్బు పోగొట్టుకున్నాడని నాకు అప్పటిదాకా తెలీదు. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు 5 నిమిషాలు పూరీతో మాట్లాడితే జీవితంపై ఎక్కడలేని ప్రేమ వస్తుంది. ఆయన గురించి అంతా తెలిశాక పూరీగారినే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా' అని చెప్పుకొచ్చాడు.