Producer Abhishek Agarwal Talks About The Kashmir Files Movie - Sakshi
Sakshi News home page

The Kashmir Files: ముందుగానే ఊహించా.. భయపడేది లేదు: అభిషేక్ అగర్వాల్

Published Fri, Mar 18 2022 7:24 PM | Last Updated on Fri, Mar 18 2022 7:44 PM

Abhishek Agarwal Talk About The Kashmir Files Movie - Sakshi

‘సినిమా అనేది కమర్షియల్. కానీ ఐదు లక్షల మంది కశ్మీర్ పండిట్‌ల బాధలు, సమస్యలను 32 ఏళ్ల తర్వాత ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’మూవీతో  బయటకు తెచ్చాం. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ  సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది.  కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నాను’అన్నారు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. 1980-90లలో కశ్మీర్‌లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా  ఈ చిత్రాన్ని  తెరకెక్కించారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి.  అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. ఆ విశేషాలు.

► ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా.

 సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్‌కు వచ్చింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుంచి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. రెండు వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు.

ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్  చేశాం.. మూడు నెలలపాటు అమెరికా, కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.

► ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. కశ్మీర్ పండితులకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం.

ప్రధాని నరేంద్రమోదీని  కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను.

► ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగాను ప్రిపేర్ అయ్యాను.

► నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు.

► త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం. 

► మా సినిమాకు అస్సాం, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం  9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది.

ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు.

షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్‌కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి.

ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు.

కొత్త సినిమాలు: రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్‌తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement