అలాంటి సినిమాకు జాతీయ అవార్డా..? ముఖ్యమంత్రి ఫైర్‌! | 71st National Film Awards: Kerala CM Pinarayi Vijayan Slams National Award For The Kerala Story | Sakshi
Sakshi News home page

‘ది కేరళ స్టోరీ’కి జాతీయ అవార్డు.. సీఎం ఆగ్రహం!

Aug 2 2025 10:46 AM | Updated on Aug 2 2025 1:21 PM

71st National Film Awards: Kerala CM Pinarayi Vijayan Slams National Award For The Kerala Story

‘ది కేరళ స్టోరీ’ సినిమాకు రెండు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ) అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డులు రావడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ‘‘మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తీసిన సినిమాకు గౌరవాన్ని కల్పించడం అనేది సంఘ్‌పరివార్‌ విభజనాత్మక సిద్ధాంతాలను పరోక్షంగా అవార్డు జ్యూరీ కమిటీ సమర్థించినట్లే. 

అలాగే మత సామరస్యానికి చిరునామా అయిన కేరళను అవమానించినట్లే. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు... ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ బాధించే అంశం. రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ స్వరం విప్పాలి’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు విజయన్ .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement