వాలెంటైన్స్ డే సందర్భంగా ‘6th జర్నీ’ నుంచి లవ్ సాంగ్ | Sakshi
Sakshi News home page

వాలెంటైన్స్ డే సందర్భంగా ‘6th జర్నీ’ నుంచి లవ్ సాంగ్

Published Wed, Feb 14 2024 4:00 PM

6TH Journey Movie Song Out Now - Sakshi

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా ‘ఆకాశంలోని చందమామ’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. మూవీకి ఎం.ఎన్.సింహ సంగీత సారథ్యం వహింస్తున్నారు. రామారావు మాతుమూరు రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు.

ఈ సందర్భంగా... దర్శకుడు బసీర్ ఆలూరి,నిర్మాత పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా అరుణకుమారి ఫిలింస్ బ్యానర్‌లో రూపొందుతున్న ‘6జర్నీ’ మూవీ నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ‘ఆకాశంలోని చందమామ..’ అనే పాటను విడుదల చేస్తున్నాం. ప్రేమ, థ్రిల్లింగ్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో ‘6జర్నీ’ తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

ఈ సినిమాలో రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి, అభిరాం, సంజయ్ ఆచార్య, జబర్దస్త్ చిట్టిబాబు తదితరులు నటించారు. బసీర్ అలూరి డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

- పోడూరి నాగ ఆంజనేయులు

Advertisement
Advertisement