21 Grams Pilot Film: 21 గ్రామ్స్‌కు 17 అంతర్జాతీయ అవార్డులు

21 Grams Pilot Film Collected 17 International Awards - Sakshi

57 నిమిషాల నిడివి ఉన్న 21 గ్రామ్స్‌ చిత్రం 17 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నవ దర్శకుడగా యాన్‌ శశి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇంతకు ముందు పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ఈయన వినూత్న ప్రయత్నం చేసిన ఇందులో కథానాయకుడిగా మోగణేష్‌ నటించారు. మరో ప్రధాన పాత్రలో ఇటీవల కన్నుమూసిన పూ రాము నటించారు. దీనికి సుందర్‌ రాజన్, అన్బు డెన్నిస్‌లు ఛాయాగ్రహణం, విజయ్‌ సిద్ధార్థ్‌ సంగీతాన్ని అందించారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ప్రాణం విలువ వెలకట్టలేనిదని, మనిషి ప్రాణాన్ని తీసే హక్కు, అధికారం ఎవరికి లేదనే సందేశాన్ని ఇచ్చే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. పూర్తి నిడివితో చిత్రాన్ని చేయాలన్నదే తన కల అని, అలా ఒక కథను తయారు చేసుకుని ప్రముఖ నిర్మాణ సంస్థలో చిత్రం చేయడానికి సన్నాహాలు జరిగాయని చెప్పారు. అయితే కరోనా కారణంగా ఆ చిత్రం ప్రారంభానికి జాప్యం జరిగిందని తెలిపారు. దీంతో 15 నిమిషాల నిడివితో ఒక పైలట్‌ చిత్రాన్ని చేయాలని భావించామని, అయితే కథ డెవలప్‌మెంట్‌తో 57 నిమిషాల నిడివికి చేరుకుందని అదే ‘21 గ్రామ్స్‌’చిత్రమని చెప్పారు.

చిత్రాన్ని తొలిసారిగా కోల్‌కత్తా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డులను గెలుచుకుందన్నారు. అలాగే ఠాగూర్‌ అంతర్జాతీయ దినోత్సవాలు, సింగపూర్‌ చిత్రోత్సవాలు, టోక్యో, ఇటలీ, రోమ్, అమెరికన్‌ గోల్డెన్‌ పిక్చర్స్‌ చిత్రోత్సవాల్లో ఇప్పటి వరకు 17 అవార్డులను గెలుచుకుందని తెలిపారు. ఒక పూర్తి చిత్రాన్ని చూసిన సంతృప్తిని కలిగించే విధంగా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రాన్ని చూసిన పలువురి నుంచి లభించిన అభినందనలు గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డులు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 

చదవండి: (Engineering Student: ఇంజినీరింగ్‌ మధ్యలో హిజ్రాగా మారి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top