కార్తీక పౌర్ణమికి కేతకీ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

కార్తీక పౌర్ణమికి కేతకీ ముస్తాబు

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

ఝరాసంగం(జహీరాబాద్‌): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయం కార్తీక పౌర్ణమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు అ యింది. మంగళవారం మధ్యాహ్నం 12:45కు ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం అమృతగుండంలో గంగా హారతి నిర్వహిస్తారు. అనంతరం భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పాలకమండలి, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకలకు జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ కుమార్‌ షెట్కార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement