భగీరథుడే మనకు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

భగీరథుడే మనకు స్ఫూర్తి

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

మెదక్‌ కలెక్టరేట్‌: స్వర్గం నుంచి గంగను భువికి తెచ్చిన భగీరథుడే మనకు స్ఫూర్తి అని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భగీరథ మ హర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో వివిధశాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఏఓ యూనస్‌, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గంగా కిషన్‌, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement