చిత్తశుద్ధితో పని చేయండి | - | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితో పని చేయండి

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జనగణనలో తహసీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. గురువారం జిల్లాలోని అధికారులతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈసందర్భంగా జనగణన, డ్రైలాండ్‌ వెట్‌ ల్యాండ్‌ సర్వే, ఆర్టీసీ సమ్మైపె సమీక్షించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు, పురుగు మందులు కొరత లేకుండా బఫర్‌ స్టాక్‌ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 525 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 11 కొనుగోలు కేంద్రాల ద్వారా 143 మంది రైతులు నుండి 887 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. సాదాబైనామా పెండింగ్‌ దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో 606 చెరువుల సంరక్షణలో భాగంగా డ్రైలాండ్‌ వెట్‌ ల్యాండ్‌ సర్వే వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా పనిచేస్తున్న జోజి 2019 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఈసందర్భంగా ఆయన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలవడంతో ప్రశంసించారు. జోజి అటవీ శాఖలో అలుపెరగని ఆణిముత్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్‌ఓ నిత్యానంద్‌, డీఎం జగదీష్‌, డీపీఓ యాదయ్య, పరిశ్రమల అధికారి ప్రకాశ్‌రావు, సీపీఓ సురేశ్‌, డీటీఓ వెంకటస్వామి, ఆర్టీసీ డీఎం సురేఖ, డీఏఓ దేవకుమార్‌, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement