మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ హబ్‌’ | - | Sakshi
Sakshi News home page

మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ హబ్‌’

Apr 25 2025 11:48 AM | Updated on Apr 25 2025 11:48 AM

మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ హబ్‌’

మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ హబ్‌’

డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు

మెదక్‌ కలెక్టరేట్‌: స్వయం సహాయక సంఘాల మ హిళా పారిశ్రామిక వేత్తలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి వీ హబ్‌ చేయూతనిస్తుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్‌’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రెండేళ్లుగా కొనసాగనున్న ఈ ప్రోగ్రాంలో ఎంపికై న మహిళా పారిశ్రామికవేత్తలు తమ బిజినెస్‌ను వేగవంతం చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం వ్యాపారులకు పలు రంగాలకు సంబంధించి బిజినెస్‌ నైపుణ్యాలపై శిక్షణ ఉంటుందన్నారు. అలాగే యువ విద్యార్థులకు కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌, కెరీయర్‌ రెడినీస్‌ కోసం వీ హబ్‌ నిర్వహిస్తున్న ‘ఐ లీప్‌’ క్యాంపస్‌ ప్రేణ్యూర్‌ కార్యక్రమంపై వివరించారు. కార్యక్రమంలో మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement