మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Mar 27 2025 6:05 AM | Updated on Mar 27 2025 6:05 AM

మెరుగ

మెరుగైన వైద్యం అందించాలి

కొల్చారం(నర్సాపూర్‌): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించడంతో పాటు అవసరమైన మందుల లభ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారి ప్రవీణ్‌ కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

28న తైబజార్‌ వేలం

రామాయంపేట(మెదక్‌): Ð]l¬°Þ-´ëÍsîæ ç³Ç-«¨ÌZ° O™ðlº-gêÆŠḥæ ÐólÌS… D¯ðlÌS 28Ð]l ™ól©¯]l Ð]l$«§éÅçßæ²… 12 VýS…r-ÌSMýS$ °Æý‡Ó-íßæ…-^èl-¯]l$-¯]l²r$Ï Ð]l¬°Þ-ç³ÌŒæ MýSÑ$-çÙ¯]lÆŠ‡ §ólÐól…-§ýlÆŠ‡ º$«§ýl-ÐéÆý‡… JMýS {ç³MýSr-¯]lÌZ õ³ÆöP-¯é²Æý‡$. D AÐ]l-M>-Ô>°² çܨ-Ó-°-Äñæ*VýS… ^ólçÜ$-MøÐéÌS° çÜ* _…-^éÆý‡$.

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు

నర్సాపూర్‌: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు ఏడీఏ సంధ్యరాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన డివిజన్‌ పరిధిలోని నర్సాపూర్‌, శివ్వంపేట, మనోహరాబాద్‌, తూప్రాన్‌ మండలాల్లో ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె చెప్పారు. ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని, మరిన్ని వివరాలకు మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు.

పకడ్బందీగా పది పరీక్షలు

నర్సాపూర్‌/కౌడిపల్లి: పదో తరగతి పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్‌ నగేష్‌ బుధవారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో పరీక్షల నిర్వహణ, సౌకర్యాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ ఫైజల్‌, సీఎస్‌ శ్రీధర్‌రెడ్డిఉన్నారు.

మీనాక్షి నటరాజన్‌ను

కలిసిన కాంగ్రెస్‌ నేతలు

నర్సాపూర్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను బుధవారం ఢిల్లీలో పలువురు నేతలు కలిశారు. గురువారం డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లిన మెదక్‌, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్‌, నిర్మలా జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారని వారు తెలిపారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

కౌడిపల్లి(నర్సాపూర్‌): అంగన్‌వాడీ టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీడబ్ల్యూఓ హైమావతి హెచ్చరించారు. బుధవారం కౌడిపల్లిలోని 2, 3, 5వ అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా పిల్లలు, బాలింతలు, గర్భి ణుల వివరాలను పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. టీచర్లు సమయపాలన పాటించాలని, మెనూ ప్రకారం వంట చేయించాలని సూచించారు. ఆట పాటల ద్వారా పిల్లలకు విద్యా బోధన చేయాలన్నారు. అలాగే మండలంలోని తిమ్మాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని సీడీపీఓ హేమభార్గవి తనిఖీ చేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి 
1
1/1

మెరుగైన వైద్యం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement