16.80 కోట్లు
9
రూ.
రోజులు..
ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ పనులకు గడువు ముంచుకొస్తుంది. కేవలం తొమ్మిది రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో రూ. 16.80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. లేనిచో ఆ నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు.
– మెదక్‌జోన్
జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పని దినాలను బట్టి మెటీరియల్ కాంపోనెట్ నిధులు విడుదల అవుతాయి. ఈసారి జిల్లాకు రూ. 42 కోట్లు విడుదల కాగా, వాటిని ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 31) వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల నుంచి 95 శాతం పల్లెల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడుతుండగా, మరో ఐదు శాతం నిధులను పశువుల పాకల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 60 శాతం.. అనగా రూ. 25.20 కోట్ల పనులు మాత్రమే అధికారులు చేశారు. ఈ లెక్కన ఇంకా రూ. 16.80 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకు కేవలం 9 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆగమేఘాల మీద పనులు చేస్తున్నారు.
నేతల ఇళ్ల ముంగిట సీసీ రోడ్లు!
గతంలో గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఉండటంతో సర్పంచ్‌లు గ్రామ సభలు పెట్టి ఏ వీధిలో సీసీరోడ్లు, ఎక్కడ మురికి కాలువల నిర్మాణాలు చేపట్టాలని తీర్మాణం చేసి పనులు చేసే వారు. ప్రస్తుతం సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఏడాది కావొస్తుండటంతో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు పనులు చేపడుతున్నారు. ఇదే అదునుగా వారి ఇళ్ల ఎదుట సీసీ రోడ్లు వేసుకుంటున్నారు. ప్రజాధనంతో పది మంది నడిచే బాటలో సీసీ రోడ్లు వేయాలి, కానీ ప్రజల సొమ్మతో ఇళ్ల ముందు రోడ్లు వేసుకోవటం ఏంటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
హడావుడి పనులు.. నాణ్యత లోపాలు
నిధులు ల్యాప్స్ కావొద్దనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు హడావుడిగా చేస్తున్నారు. చాలా చోట్ల ఇసుకకు బదులు రాతి ఫౌడర్‌ను మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా కాలం మన్నికగా ఉండదని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సీసీ రోడ్డు నిర్మించిన అనంతరం కనీసం 28 రోజుల పాటు వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల వారం కూడా చేయటం లేదని తెలుస్తోంది. దీంతో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
నిధులు ఖర్చు
చేయకపోతే వెనక్కే
ఆగమేఘాలపై సీసీ రోడ్ల నిర్మాణాలు
ఉపాధి హామీ మెటీరియల్‌కాంపోనెంట్ పనుల తీరు
నిధులు ల్యాప్స్ కాకుండా చర్యలు
ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిధులు ల్యాప్స్ కాకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాకు రూ. 42 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ. 25.20 కోట్ల పనులు పూర్తి చేశాం. మరో రూ. 16.80 కోట్ల పనులు చేయాల్సి ఉంది.
– నర్సయ్య,
పీఆర్ ఈఈ, మెదక్


