ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

Mar 17 2025 9:37 AM | Updated on Mar 17 2025 9:37 AM

ప్రజల

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

పెద్దశంకరంపేట(మెదక్‌): అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పెద్దశంకరంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మండలంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయించానని, వాటిని పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దళితబంధులో పలువురికి మంజూరైన నిధులు సైతం ఇవ్వడం లేదన్నారు. గతంలో ప్రభుత్వ పట్టాలు పొంది గృహలక్ష్మిలో మంజూరైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు మానిక్‌రెడ్డి, జంగం రాఘవులు, శంకర్‌గౌడ్‌, సుభాష్‌, రవీందర్‌, యాదుల్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

‘పెండింగ్‌ బిల్లులు, జీతాలు విడుదల చేయాలి’

మెదక్‌ కలెక్టరేట్‌: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు, జీతాలను వెంటనే విడుదల చేయాలని యూనియన్‌ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలలుగా జీతాలు, బిల్లులను చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అప్పులు తెచ్చి పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పెడుతూ కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, కార్మికులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా పెండింగ్‌ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మి, పద్మ, లావణ్య, నాగమణి, సక్కుబాయి, మౌనిక, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

నాచగిరి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

వర్గల్‌(గజ్వేల్‌): నాచగిరి లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం ఆలయ ఈఓ పార్నంది విశ్వనాథశర్మ పలువురు.. ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలను వేర్వేరుగా కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.

6,500 కోళ్లు మృత్యువాత

చిన్నశంకరంపేట(మెదక్‌): అంతుచిక్కని వైరస్‌తో కోళ్లు మృత్యువాతపడిన సంఘటన మండలంలోని గవ్వలపల్లి గెరిల్లాతండాలో ఆదివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్‌ స్వామినాయక్‌ కోళ్లఫాంలో ఒక్కసారిగా 6,500 కోళ్లు మృతిచెందగా, పంట పొలంలో గోతి తీసి పాతిపెట్టారు. ఒక్కసారిగా లక్షల్లో నష్టం కలిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.

కార్మికుల కోసం

నిరంతర పోరాటం

పటాన్‌చెరు: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతర పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. పటాన్‌చెరులోని శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూ నియన్‌ సీఐటీయూ అనుబంధంగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పోచారంలో క్రికెట్‌ పోటీలను నిర్వహించారు.

ప్రజలను మోసం  చేస్తున్న ప్రభుత్వం 
1
1/2

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

ప్రజలను మోసం  చేస్తున్న ప్రభుత్వం 
2
2/2

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement