
చెక్‌డ్యాంలతో మేలు
వెల్దుర్తి(తూప్రాన్): చెక్‌డ్యాంలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. మండలంలోని మానెపల్లి, మంగళపర్తి గ్రామ శివారులో వాగుపై సెహగల్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మించిన చెక్ డ్యాంను గురువారం వారు ప్రారంభించి మా ట్లాడారు. అన్నదాతల సంక్షేమానికి సెహగల్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషిని కొనియా డారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కా ర్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఇరిగేషన్ డీఈ రాజేందర్, మాజీ సర్పంచ్ రామకృష్ణారావు, సెహగల్ ఫౌండేషన్ అడ్మిన్ మేనేజర్ బాలరాజ్, సీనియర్ ఇంజనీర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.