బాలికల క్రికెట్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

బాలికల క్రికెట్‌ ఎంపిక పోటీలు

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

మంచిర్యాలటౌన్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదా నంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బాలికల క్రికెట్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి క్రికెట్‌ అపరేషన్‌ కమిటీ సెలక్టర్లు జి.రవికుమార్‌రెడ్డి, చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఎం.రేవతి హాజరై పోటీలను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వివిధ వయసుల వారీగా ఆడించి, అందులో ప్రతిభను కనబర్చినవారిని ఎంపి క చేశారు. వీరికి హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ జిల్లా క్రికెట్‌ కార్యదర్శి కోదాటి ప్రదీప్‌, సీనియర్‌ కోచ్‌ పోరండ్ల ప్రదీప్‌, మేనేజర్‌ కోలి వేణుమాధవ్‌, సీనియర్‌ క్రీడాకా రుడు చందు తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement