జీపీడీపీలో జిల్లా ఫస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జీపీడీపీలో జిల్లా ఫస్ట్‌

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

మంచిర్యాలరూరల్‌(హజీపూర్‌): గ్రామ పంచాయ తీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) తయారీ, ఆన్‌లైన్‌ నమోదులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పంచాయతీ రాజ్‌ శాఖలో జీపీడీపీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన డీఎల్‌పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్ల కృషి అభినందనీయమని జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి (డీపీవో), జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖాధికారి (డీఆర్‌డీవో) ఎస్‌.కిషన్‌ కొ నియాడారు. ఈ ఘనత సాధించినందుకు గానూ డీ ఎల్‌పీవోలు సతీశ్‌కుమార్‌, ధర్మారాణి, ఎంపీవోలు శ్రీపతి బాపు, సఫ్దర్‌అలీ, అజ్మత్‌అలీ, శ్రీనివాస్‌, అనీల్‌, సుమన్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్‌, కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం నుంచి పూదరి నరేందర్‌, బొడ్డు శ్రావణ్‌కుమార్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, జిల్లాలోని సమస్త పంచాయతీ కార్యదర్శులు డీపీవో కిషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని 306 పంచాయతీల్లో జీపీడీపీ తయారీ, ఆన్‌లైన్‌ నమోదులో 217 పంచాయతీలు ఏ+ గ్రేడ్‌, 89 పంచాయతీలు ఏ గ్రేడ్‌ సాధించాయి.

బెల్లంపల్లి డివిజన్‌లో ఆన్‌లైన్‌లో

గ్రేడ్‌ల వారీగా గ్రామాలు

మండలం గ్రామాలు ఏ+ ఏ

బెల్లంపల్లి 17 14 3

భీమిని 12 09 3

కాసిపేట 22 20 2

నెన్నెల 19 18 1

తాండూర్‌ 15 15 –

వేమనపల్లి 14 09 5

కన్నెపల్లి 15 14 1

మొత్తం 114 99 15

మంచిర్యాల డివిజన్‌లో ఆన్‌లైన్‌లో

గ్రేడ్‌ల వారీగా గ్రామాలు

భీమారం 11 10 1

చెన్నూర్‌ 30 07 23

దండేపల్లి 31 28 3

హాజీపూర్‌ 12 11 1

జైపూర్‌ 20 16 4

జన్నారం 29 12 17

కోటపల్లి 31 10 21

లక్సెట్టిపేట 18 15 3

మందమర్రి 10 09 1

మొత్తం 192 118 74

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement