వంతెన నిర్మించాలని కాంగ్రెస్‌ రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

వంతెన నిర్మించాలని కాంగ్రెస్‌ రాస్తారోకో

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

భీమారం: మంచిర్యాల–చెన్నూర్‌ జాతీయ రహదారి 63పై భీమారం సమీపంలో జోడువా గుల వద్ద నాలుగు వరుసల వంతెన నిర్మించా లని డిమాండ్‌ చేస్తూ ఆదివారం డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చెన్నూర్‌ నియోజకవర్గంలోని భీమారం, జైపూర్‌, కోటపల్లి, జైపూర్‌ మండలాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించిందన్నారు. స్థలాన్ని త్రిసభ్య కమిటీ సందర్శించాల్సి ఉండగా నేటికీ రాలేదన్నారు. చెన్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేశ్‌ ప్రసాద్‌ తివారీ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పొడేటి రవి, కరుణాసాగర్‌రావు, రాంరెడ్డి, రాజమల్లుగౌడ్‌, లక్ష్మణ్‌, సత్యనారా యణరెడ్డి, మల్లన్న, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement