తిరుగు ప్రయాణం తిప్పలు..! | - | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణం తిప్పలు..!

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

● రద్దీతో రైళ్లలో కష్టాలు ● ఆర్టీసీ బస్సుల్లో ఫుల్‌..

మంచిర్యాలఅర్బన్‌: రాఖీ పండుగ వేడుకలు ముగించుకుని తిరుగు ప్రయాణమైన ప్రయాణికులతో రైళ్లు, బస్సులు తీవ్ర రద్దీగా మారాయి. ఆదివారం భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేనంత రద్దీ పెరిగింది. నిలబడేందుకు కూడా స్థలం లేక మహిళలు, చిన్నారులు, వయో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.

ప్రత్యేక రైళ్లేవి?

పండుగ వేళల్లో ప్రత్యేక రైళ్లు నడపకపోవడంతో భాగ్యనగర్‌ రైలులో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తో ంది. భాగ్యనగర్‌ సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు 3:35 నిమిషాలకు బయలు దేరుతుంది. ఆ తర్వాత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 8:10 గంటలకు బయలు దేరుతుంది. కానీ టికెట్‌ ధర చాలా ఎక్కువ కావడంతో సాధారణ ప్రయాణికులు ఆసక్తి చూపని పరిస్థితి. ఆ తర్వాత 11:40 నిమిషా లకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నప్పటికీ దీనికి హాల్టింగ్‌లు తక్కువ. ఇందులో సాధారణ బోగీలు నాలుగు మాత్రమే ఉంటాయి. ఢిల్లీ నుంచి రావడం వల్ల ఈ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. మధ్యాహ్నం 12:20 గంటలకు 15 బోగీలున్న ఇంటర్‌ సిటీ రైలు ఉంటుంది. దీనికి హాల్టింగ్‌లు తక్కువే. మధ్యాహ్నం 2:50 నిమిషాలకు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ సూ పర్‌ఫాస్ట్‌ రైలు ఉంటుంది. దీంతో భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలు, ఇంటర్‌ సిటీ రైళ్ల మీద ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం 17036 బల్లార్షా నుంచి కాజీపేట్‌ మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు కాజీపేట జంక్షన్‌లో 14 గంటలు ఖాళీగా ఉంటున్న కారణంగా ఈ రైలును సికింద్రాబాద్‌ వరకు పొడిగించాలని డిమా ండ్‌ ఉంది. ఈ రైలు బల్లార్షాలో ఉదయం 3:50కు బదులుగా 5 గంటలకు ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాలున్నాయి. కాజీపేట్‌ నుంచి బల్లా ర్షా మార్గంలో 2012 తర్వాత ఇంటర్‌ సిటీ, పుష్‌పుల్‌ లాంటి నూతన రైళ్లను ప్రవేశ పెట్టలేదు. మూడోమా ర్గం కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ప్రయాణికుల రద్దీని దృశ్యా రైళ్లు ప్రారంభించకపోవడంతో కష్టాల ప్రయాణం సాగుతోంది.

బస్సుల్లో సీట్లు ఫుల్‌..

రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు బస్సుల వైపే మళ్లడంతో రద్దీ తీవ్రతరమైంది. రద్దీ తీవ్రతను బట్టి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సాధారణ రోజుల్లో 38 బస్సులు నడుస్తుండగా రద్దీని తట్టుకోవడానికి 29 బస్సులు అదనంగా ఏర్పాటు చేసింది. ముందస్తు రిజర్వేషన్‌ సీట్లు నిండిపోయాయి. బస్‌ స్టేషన్‌కు బస్సు వచ్చిందంటే చాలు.. సీటు ఉందా? అని అడగడం ప్రయాణికుల వంతైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement