బజార్‌హత్నూర్‌లో నేడు అంతర్రాష్ట్ర పోటీలు మహారాష్ట్ర, ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న మల్లయోధులు 80 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
బజార్‌హత్నూర్: ప్రస్తుత సమాజంలో ఎన్నో ఆధునిక క్రీడలు పుట్టుకొచ్చినప్పటికీ పల్లెల్లో కుస్తీ పోటీలకు ఆదరణ తగ్గడం లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా నిలుస్తున్న కుస్తీ పోటీలంటే పల్లె ప్రజలకు ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతోనే ఏటా హోలీ పండగను పురస్కరించుకుని బజార్‌హత్నూర్‌లో కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించనున్న అంతర్రాష్ట్ర కుస్తీ పోటీల్లో మహారాష్ట్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మల్లయోధులు పాల్గొననున్నారు.
80 ఏళ్లుగా పోటీలు..
80 ఏళ్లుగా బజార్‌హత్నూర్‌లో కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. మొదటి 30 సంవత్సరాలు హనుమా న్ జయంతి రోజున గ్రామ సమీపంలోని మహాదేవు ని మందిరం ఆవరణలో జరిగే జాతరను పురస్కరించుకుని పోటీలు నిర్వహించేవారు. కాలక్రమేణా మహాదేవుని ఆలయ పరిసరాలు దెబ్బ తినడంతో పూలాజీబాబాధ్యానకేంద్రం సమీపంలోని మైదా నంలో ఏటా హోలీ రోజుపోటీలు నిర్వహిస్తున్నారు.
అనాదిగా వస్తున్న ఆచారం
బజార్‌హత్నూర్ గ్రామం దేశ స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటైంది. గ్రామంలోని అన్ని కుటుంబాలు తూర్పు మహారాష్ట్ర నుంచి వలస వచ్చినవే. ఇందు కు కారణం నిజాం కాలంలో పల్సికర్ రంగారావు (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేష్ ముఖ్ మామ) ఈ ప్రాంతానికి సంస్థానాధీశులుగా ఉండేవారు. ఆయన ప్రోద్భలంతో మహారాష్ట్ర సంప్రదాయమైన ఈ కుస్తీ పోటీలను ఏ టా నిర్వహిస్తున్నారు. గతంలో బజార్‌హత్నూర్ గ్రా మ మల్లయోధులను ఓడించడం సవాల్‌తో కూడుకుని ఉండేది. కాలక్రమేణ అటువైపు ఎవరూ దృష్టి పెట్టకపోవడంతో మహారాష్ట్ర పరిసర ప్రాంతాల ను ంచి వచ్చిన మల్లయోధులతో పోటీలు నిర్వహించారు. ప్రస్తు తం ఉమ్మడి జిల్లాలోని జైనూర్, నార్నూర్, కుభీర్, తానూరు, ఖానాపూర్, మందపల్లి, బజార్‌హత్నూర్, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ, తలమడుగు, మహారాష్ట్రలోని పూణే, నాందేడ్, యవత్మాల్, కిన్వట్, లాతూర్, చంద్రపూర్ జిల్లాల నుంచి మల్లయోధులు పోటీల్లో పాల్గొంటున్నారు.


