మాది మహారాష్ట్రలోని నాందేడ్. నేను పదిహేనేళ్లుగా కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నా. ఇప్పటి వరకు ఏడుసార్లు విజయం సాధించా. ప్రతీ సంవత్సరం నాందేడ్, పర్భని, లాతూర్, నిజామాబాద్, కుభీర్, తానూర్‌లలో జరిగే కుస్తీ పోటీలలో కూడా పాల్గొంటా.
– సాహు గడేకర్, మల్లయోధుడు, నాందేడ్
సంప్రదాయం కాపాడుతున్నాం
మా గ్రామంలో ఏటా హోలీకి అంతర్రాష్ట్ర కుస్తీపోటీలు నిర్వహిస్తున్నాం. నేడు జరుగనున్న పోటీల నిర్వహణకు గ్రామస్తుల నుంచి రూ.లక్ష వరకు విరాళాలు సేకరించాం. మా పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుతున్నాం. – పర్చ సాయన్న, సర్పంచ్


