30 ఏళ్లకు పైగా ఎడ్లతోనే..
దండేపల్లి: కష్టపడితే వ్యవసాయం పండుగే అని చెప్తున్నారు దండేపల్లి మండలం మా దా పూర్‌కు చెందిన కుమ్మరి మల్లేశం, లక్ష్మి దంపతులు. వ్యవసాయంలో 40 ఏళ్ల అనుభవాన్ని పంచుకున్నారు. తమకున్న 8 ఎకరాల్లో 6 ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో ఏడాది పొడవునా కూరగాయలు (వంగ, బెండ, టమాట, చిక్కు డు, అలసంద, బబ్బెర, మిర్చి), ఆకుకూరలు (పాలకూర, చుక్కకూర, తోటకూర, కొత్తిమీ ర, మెంతి, పూదీనా)ఆవాలు పండిస్తున్నారు. వాటిని సమీపంలో జరిగే వారసంతల్లో విక్రయిస్తున్నారు. నెలకు సుమారు రూ.30 నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. 40 ఏళ్ల వ్యవసాయంలో దాదాపు 30 ఏళ్లకు పైగా ఎడ్లతోనే ఎవుసం చేశామని, వయస్సు పైబడడంతో నాలుగేళ్లుగా ట్రాక్టర్‌తో దున్నిస్తున్నామన్నారు. కష్టపడి పనిచేస్తే వ్యవసాయంలో లాభాలు తప్పా నష్టాలు ఉండవంటున్నారు.


