వైభవంగా సదల్‌పూర్ జాతర
కై లాస్‌నగర్(బేల): బేల మండలంలోని సదల్‌పూర్‌లో అతిపురాతనమైన భైరాందేవ్ మహాదేవ్ ఆలయంలో ఏటా పుష్యమాసంలో నిర్వహించే జంగి జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. కొరంగే వంశస్తులు, సర్పంచ్ దంపతులు ఆదివాసీల సంప్రదాయం ప్రకారం డప్పుచప్పుళ్లు, భజనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఈ నెల 19 వరకు కొనసాగనుంది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు కోరంగే సోనేరావ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆశన్న రచించిన సదలేశ్వర శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్యామ్‌రావ్, సర్పంచ్ మర్సకోల మంగేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


