ఆదర్శం.. సుమేష్
లక్ష్మణచాంద: నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన కంచరి సుమేష్ అనే యువరైతు సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న ఎకరం చేనులో సాధారణ రకం వరి సాగు చేస్తున్నాడు. ఎలాంటి రసాయనిక ఎరువులు వినియోగించకుండా జీవామృతం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, వెస్ట్ డీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులు వ్యవసాయక్షేత్రంలో తానే తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తున్నాడు. ఎకరాకు 22 నుంచి 24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని చెబుతున్నాడు. తాను పండించిన ధాన్యం ఇంటివద్దనే సువర్ణపురి ఆర్గానిక్ ప్రొడక్ట్ పేరిట క్వింటాలుకు రూ.6500 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపాడు.


