కష్టమైనా ఇష్టంతో..
జన్నారం: కష్టమైనా ఇష్టంతో పనిచేస్తే వ్యవసాయం పండగేనని నిరూపిస్తున్నాడు మండలంలోని కలమడుగుకు చెందిన గడ్డి విష్ణుమూర్తి. తల్లిదండ్రులిచ్చిన పదెకరాల్లో వ్యవసాయం చేసి మరో 16 ఎకరాలు కొనుగోలు చేశాడు. 2008 నుంచి వ్యవసాయాన్నే నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంటకు రూ.5 నుంచి 6 లక్షల వరకు సంపాదిస్తానంటున్నాడు. 12 ఎకరాల్లో పామాయిల్, రెండెకరాల్లో పత్తి, మిగతా 12 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం వరకు రెండెకరాల్లో కూరగాయలు, మిర్చి, క్యాబేజీ, క్యారట్, ఆకుకూరలు సాగు చేశానని, కోతుల బెడద పెరగడంతో మానుకున్నట్లు పేర్కొన్నాడు.


