స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: యువత స్వామి వివేకానంద అడగుజాడల్లో నడవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, వివిధ శాఖ అధికారులతో కలిసి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మనిషి విజ్ఞానంతోపాటు విలువలతో ఎదుగాలని బోధించిన మహనీయుడు వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరెడ్డి, వివిధ శాఖల అధికారులు దుర్గప్రసాద్, పురుషోత్తం నాయక్, జెడ్పీసీఈవో గణపతి, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


