జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్
ఖానాపూర్: మండలంలోని సింగాపూర్‌కు చెందిన నాగలక్ష్మి అర్నిస్ (కర్ర యుద్దక్రీడ) జాతీయస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. గ్రామంలోని కార్కూరి గంగామణి, లక్ష్మణ్ దంపతుల కుమార్తె నాగలక్ష్మి ఆదిలాబాద్‌లోని మావల బాలికల ఎంజేపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 2023లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం, 2024లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో బ్రౌంజ్‌మెడల్ సాధించింది. ఈ నెల 9 నుంచి 11 వరకు ఢిల్లీలోని కపాస్ హేర స్టేడియంలో ఆర్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ అండర్–17 పోటీల్లో బంగారు పతకం సాధించింది. త్వరలో జమ్ముకశ్మీర్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ అర్నిష్ పోటీల్లో పాల్గొననుంది.


