‘అంకితభావంతో పనిచేస్తే కాంగ్రెస్ విజయం’
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త అంకితభావంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని బెల్లంపల్లి మున్సిపాలిటీ 34 వార్డులకు చెందిన ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నాయన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చే యాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు పిన్ని ంటి రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. మున్సి పల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందన్నారు. ఎం.సూరిబాబు, సీహెచ్.శంకర్, ఎం.మల్లయ్య, మునిమంద రమేశ్, కె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


