ఇసుక క్వారీలలో అక్రమాలకు తావులేదు
చెన్నూర్: కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేటలో నడుస్తున్న ఇసుక క్వారీలలో అక్రమాలకు తావులేదని, ప్రభుత్వ నిబంధనల మేరకే నడుస్తున్నాయని టీజీఎండీసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీవో వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో మైనింగ్ ఏడీ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్వారీలకు సెలవు దినాలు ఉండవన్నారు. బుకింగ్ ప్రకారం ఇసుకల లోడింగ్ జరుగుతుందన్నారు. ప్రతీ లారీని టీజీఎండీసీ అధికారులు, సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే రవాణా జరుగుతుందన్నారు. విజిలెన్స్ అధికారులు సైతం క్వారీలను తనిఖీ చేస్తారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో నిబంధనలకు లోబడి ఇసుక తరలింపు జరుగుతోందన్నారు.


