గంజాయి విక్రేతల అరెస్ట్
వాంకిడి: గంజాయి సాగు చేసి విక్రయిస్తున్న ఇ ద్దరు వ్యక్తులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. మండలంలోని సవాతి గ్రామానికి చెందిన మోహర్లే శంకర్ వద్ద 480 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడగా దాని విలువ సుమారు రూ.12 వేలు ఉంటుందన్నారు. మండల కేంద్రంలోని పాత మసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ హరుణ్ (జావిద్) వద్ద నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడగా దాని విలువ సుమారు రూ.1000 ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.


