‘ఢిల్లీ’ వేడుకలకు వీగాం ఒగ్గు కళాకారులు
భీమిని: మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని వీగాం గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు బొప్పనపల్లి రవి, అమరగొండ అజయ్ జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఎంపికయ్యారు. జనగామ జిల్లాకు చెందన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్, బిస్మిల్లాఖాన్, జాతీయ అవార్డు గ్రహీత ఒగ్గు రవి ఆధ్వర్యంలో ఈ నెల 8న ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 25 వరకు రిహార్సల్స్ చేసి 26న కర్తవ్యపథ్ వేదికగా గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. సౌత్ జోన్, సెంట్రల్ జోన్ కల్చరల్ నుంచి 30 మందిని ఎంపిక చేయగా జిల్లాకు చెందిన రవి, అజయ్‌కి అవకాశం దక్కింది.


