వీధి కుక్కలకు అంతుచిక్కని రోగం
వీధి కుక్కలకు అంతుచిక్కని రోగం సోకింది. జిల్లా కేంద్రంలోని ఏ వీధికి వెళ్లినా కుక్కలకు చర్మ ఊడిపోయి, నల్లని, ఎర్రని మచ్చలతో దర్శనమిస్తున్నాయి. దద్దుర్లు లేచి దురదతో ఏర్పడిన పుండ్లు నీరు కారడంతో ఈగలు, దోమలు వాలుతున్నాయి. చికెన్ సెంటర్ల నుంచి వచ్చే వ్యర్థాలు తిన్న శునకాలకు ఎక్జామిన్ ధర్మటిసీస్ వ్యాధి సోకుతోందని పశు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన కుక్కలు ఇళ్లలోకి రావడంతో మనుషులకు సైతం సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


