రోడ్డు విస్తరణపై అభిప్రాయ సేకరణ
చెన్నూర్: చెన్నూర్ అంబేడ్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు రావి చెట్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద చెరువు కట్ట వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. జేఏసీ నాయకులు సిద్ది రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణపై ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇరుకు రోడ్డుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, 66 ఫీట్లు రోడ్డు వెడల్పు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకులను నిలదీసిన వ్యాపారులు
ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు మీరేవరని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులను రోడ్డు విస్తరణ బాధిత వ్యాపారులు ప్రశ్నించారు. రోడ్డు విస్తరణకు తాము అడ్డుకాదని, 66 ఫీట్లు కాకుండా తక్కువ చేయాలని మంత్రిని కోరామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో మీ ప్రమేయం ఏమిటని నిలదీశారు.


