అనాథ శవానికి అంత్యక్రియలు
జన్నారం: అనారోగ్యంతో మృతి చెందిన అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించి ఉదారత చాటుకున్నాడు. జన్నారం మండలం పోన్కల్ గ్రామ పంచాయతీలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న నారపాక శ్రీను కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వార్డు సభ్యుడు ముడుగు ప్రవీణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించాడు. అనాధలు, నిరుపేదలను ఆదుకునేందుకు పీసీఆర్ ఫౌండేషన్ ముందుంటుందన్నారు. కాగా ప్రవీణ్‌కుమార్‌ను సోషల్ మీడియా వేధికగా పలువురు అభినందించారు.


