జాతీయస్థాయిలోనూ సత్తాచాటాలి
పెర్కిట్(ఆర్మూర్): రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో నిర్వహించి 70వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల, బాలికల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జట్టుకు, బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా జట్టుకు ఎమ్మెల్యే ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


