దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
● ముగ్గురు నిందితుల రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: దోపిడీ కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శుక్రవారం మార్కెట్ యార్డు వద్ద బాధితుడు మునీశ్వర్ గౌరవ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు నిందితులు అతని వద్ద నుంచి రూ.1050తోపాటు ఫోన్ లాక్కొని పరారీ అయ్యారు. బాధితుడు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు ఆదిలాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌక్‌కు చెందిన నిందితులు గజ్బే కిరణ్, ఖుర్షీద్‌నగర్‌కు చెందిన అర్ఫాజ్ ఖాన్, డాల్డా కంపెనీకి చెందిన షేక్ మోయిన్‌లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.వెయ్యి నగదుతోపాటు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.


