జంతుగణనకు సన్నద్ధం
జన్నారం: నాలుగేళ్లకోసారి ఎన్‌టీసీఏ గైడ్‌లైన్స్ ప్రకా రం నిర్వహించే మాంసాహార, శాఖహార జంతువు ల గణనకు అటవీశాఖ సన్నద్ధమైంది. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని 576 అటవీ బీట్లలో ఈ గణన జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎఫ్‌డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ సంరక్షణ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్ ఆదేశాల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యక్షంగా అడవుల్లోకి తీసుకెళ్లి గణన చేసే విధానాన్ని తెలియజేశారు. మూడు రో జుల పాటు మాంసాహార, మరో మూడురోజులు శాఖ జంతువులను లెక్కిస్తారు. ఫేజ్–1, 2, 3లో వా టిని లెక్కించనున్నారు. ఫేజ్–4లో కెమెరాలు ఏర్పా టు చేసి వాటిలో చిక్కిన వాటిని లెక్కింపు చేస్తారు. 2 చదరపు కి.మీ దూరంలో ఒక్క కెమెరా ఏర్పాటు చేస్తారు. ఈ సర్వేలో సిబ్బందితోపాటు వలంటీర్లకు అవకాశం కల్పించారు. సర్కిల్‌లో సుమారు 1300 పైగా మంది గణనలో పాల్గొననున్నారు.
మూడు రోజులుగా ట్రయల్స్ సర్వే
మాంసహార జంతువులైన పులి, చిరుతపులి, ఎలు గుబంటు, అడవి కుక్కలు, నక్కలు, తోడేలు, ముంగిస, పురిటిబంటి(హమీబడ్జెర్) పైథాన్ లాంటివి లెక్కించడానికి ట్రయల్స్ సర్వే చేస్తారు. ఈనెల 19 నుంచి 21 తేదీ వరకు ఈ సర్వే చేస్తారు. ఇందుకోసం 5 కి.మీ దూరం ట్రయల్ లైన్ ఏర్పాటు చేసుకుంటారు. కాలినడక సర్వే చేసి శాఖహార జంతువులు నేరుగా కనిపించినవి, మలం, పాదముద్రలు, చెట్లపై గీరిన ఆనవాళ్లు గుర్తించి ఎంస్ట్రైబ్ ఎలకాజికల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. 400 మీటర్ల దూరంలో 10 మీటర్ల వృత్తంలో కనిపించిన చెట్లు, మొక్కలు, గడ్డిజాతులు పొదలు, ఔషధమొక్కలు లెక్కిస్తారు. వీటితోపాటు పశువులు తిరిగిన ఆనవాళ్లు, చెట్లు నరికిన ఆనవాళ్లు, ఇతర అంశాలను కూడా గుర్తిస్తారు.
ట్రాన్సెక్ట్ సర్వే ద్వారా..
ప్రతీ బీట్‌లో 2 కి.మీ దూరం ట్రాన్సెక్ట్ లైన్స్ వేస్తా రు. 2 కి.మీ దూరం పొడవున లైన్స్ వేస్తారు. శాఖ హార జంతువులైన జింకలు, కృష్ణజింకలు, కొండగొ ర్రెలు, గడ్డిజింక, నీలుగాయి, సంబారు, అడవిదున్నలు, అడవి పందులు, కుందేళ్లు తదితర వాటిని సర్వే ద్వారా లెక్కిస్తారు. నేరుగా కనిపించినవి, వా టి గుంపును బట్టి సంఖ్యను అంచనా వేస్తారు. లైన్ కు ఎడమ, కుడి వైపులతోపాటు లైన్ సూచిన ప్రకా రం ఎంత దూరంలో కనిపించిందో వివరాలను ఎంస్ట్రైబ్ ఎకలాజికల్ యాప్‌లో నమోదు చేస్తారు. ఇదే లైన్‌లో 400 మీటర్ల దూరంలో ఒకసారి 30 మీటర్ల వృత్తంలో మొక్కలు, చెట్లు, పొదలు, గడ్డి జాతులు, ఔషధ మొక్కలు తదితర రకాలు వివరాలు నమో దు చేస్తారు. వీటితోపాటు దారిలో కనిపించిన మ నుషులు, పశువుల అలజడి, చెట్లు నరికివేతకు గురవడం, పొదలు తొలగించడం తదితర అన్ని వివరాలు డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చేరుతాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పులుల, వన్యప్రాణుల గణన వివరాలను టైగర్ మానిటరింగ్ సెల్ తెలియజేస్తోంది.
ఒక్కో బీట్‌లో ముగ్గురు చొప్పున..
ట్రయల్స్, ఇన్సెక్ట్ సర్వేల్లో ప్రతీ బీట్‌లో ఒక్క ప్రదేశం ఎన్నుకుని ఆ ప్రాంతంలో ముగ్గురు సర్వే చేస్తారు. ఇద్దరు అటవీ సిబ్బంది, ఒక్క వలంటీర్ లేదా బేస్‌క్యాంపు సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చి అవసరమైన సామగ్రిని అందించారు.


