‘ఆదివాసీల పండుగలు’ పుస్తకావిష్కరణ
ఉట్నూర్‌రూరల్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో దుర్వ సంతోష్ ప్రచురించిన మావంగ్ సడ్క్ (ఆదివాసీల పండుగలు) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను అందరికీ తెలిసేలా దుర్వ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైమన్ డార్ఫ్, మార్క్ పెన్నీ రచించిన పుస్తకాన్ని పునఃప్రచురించి డార్ఫ్ బెట్టి ఎలిజెబెత్ స్మారక గ్రంథాలయం వ్యవస్థాపకుడు దుర్వ సంతోష్ సమాజానికి అంకితం చేయడం మంచి పరిణామమన్నారు. ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, రిటైర్డ్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, సర్పంచ్ రమేశ్, దస్తురాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, కడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీను యాదవ్ పాల్గొన్నారు.
అందిన రేషన్ బియ్యం
కోటపల్లి: మండలంలోని కొండంపేట గ్రామంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ‘కొండంపేటకు అందని రేషన్ బియ్యం’శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి సివిల్ సప్‌లై అధికారులు స్పందించారు. వెంటనే లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధి ఇంటి నుంచి రేషన్ బియ్యాన్ని అంగన్‌వాడీ కేంద్రానికి తరలించారు. ఉదయం నుంచే లబ్ధిదారులకు అందించారు. సమస్య పరిష్కారానికి చొరవచూపిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
కలప పట్టివేత
సిరికొండ: మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. శనివారం వడ్రంగుల ఇళ్లల్లో ఎఫ్‌ఎస్‌ఓ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. జహీర్ ఇంట్లో రూ.9 వేల విలువ గల అక్రమ కలపను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో ఎఫ్‌బీఓ సంతోష్, భీంజీ, అటవీ సిబ్బంది ఉన్నారు.
‘ఆదివాసీల పండుగలు’ పుస్తకావిష్కరణ
‘ఆదివాసీల పండుగలు’ పుస్తకావిష్కరణ


