రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నేరడిగొండ: మండలంలోని రోల్‌మామడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాపలగూడ గ్రామానికి చెందిన సిడాం సీతారాం (47) మృతిచెందాడు. బైక్‌పై దత్తు, సిడాం సీతారాంలు కలిసి సొనాల మండలం పార్డి గ్రామంలో పూజ కార్యక్రమానికి వెళ్లి తిరిగివస్తున్నారు. దత్తు బైక్ నడుపుతుండగా, యాపల్‌గూడ వెళ్లే రోల్‌మామడ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. వెనక ఉన్న సీతారాం ఘటన స్థలంలోనే మృతిచెందాడు. దత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గ్రామస్తులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపైనే మృతదేహంతో ఆందోళనకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. ఈ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మించాలనే విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. గ్రామ సర్పంచ్ మండాడి కృష్ణ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో ఫోన్‌లో మాట్లాడించగా, నెలలోగా సమస్యను పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపినట్లు సర్పంచ్ వివరించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలానికి ఇచ్చోడ సీఐ రమేశ్, నేరడిగొండ ఎస్‌సై ఇమ్రాన్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


