మంచిర్యాలలో సింగరేణి కార్మికుడు..
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై మజా రొద్దీన్ తెలిపారు. ఆయన కథ నం ప్రకారం..నస్పూర్ న్యూ సిటీకాలనీలో ఉంటున్న బొడ్డు తిరుపతి(41) ఐకే–1(ఏ) మైన్‌పై ఎస్‌డీఎల్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని నస్పూర్ నుంచి మందమర్రిలో ఉంటున్న తన అత్తగారింటికి బైక్‌పై వెళ్తున్నాడు. జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శైలజ, కుమారుడు శ్రీయన్, కూతురు మిథుల ఉన్నారు. కాగా, మృతుడు తిరుపతిది హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామం. అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బోరిగాంలో యువకుడు..
ముధోల్: మండలంలోని బోరిగాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లోలం రాజు(18) మృతి చెందినట్లు ఎస్సై బిట్లా పెర్సీస్ తెలిపారు. వివరాల ప్రకారం... లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌కు చెందిన లోలం రాజు బోధన్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవు ల నేపథ్యంలో స్నేహితులతో శనివారం కలిసి కారులో ఇంటికి వస్తున్నాడు. రాత్రి బోరిగాం శివారులో కారు అదుపుతప్పి బోల్తాపడి పల్టీలు కొట్టింది. ప్ర మాదంలో రాజు తీవ్రగాయాలు కాగా, స్థానికులు అతన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అ క్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. అతనితో పాటు తన స్నేహితులకు గాయాలయ్యాయి. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు..
చెన్నూర్‌రూరల్: మండలంలోని అక్కెపల్లి బస్టాప్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. చెన్నూర్ నుంచి సిరోంచ వైపు వెళ్తున్న కారును చెన్నూర్ వైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారులో ఇరుక్కుని అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్డం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంచిర్యాలలో సింగరేణి కార్మికుడు..


