జ్వరంతో కొలాం విద్యార్థి మృతి
ఆదిలాబాద్‌రూరల్: జ్వరంతో కొలాం విద్యార్థి మృతి చెంది న ఘటన ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉట్నూర్ మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన మడావి భగవంత్‌రావ్–మరుబాయి దంపతుల కుమారుడు మెంగురావ్ (14) ఆసిఫాబాద్ జిల్లాలోని పీవీటీజీ గురుకుల పాఠశాలలో గత విద్యా సంవత్సరం 8వ తరగతి వరకు చదివారు. ఈ సంవత్సరం పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. నెలక్రితం అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించి చికిత్స చేయించారు. గత నాలుగురోజుల క్రితం జ్వరం రావడంతో ఉట్నూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడికి నుంచి గురువారం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అడి్‌మ్‌ట్ చేశారు. పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు సంబంధిత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
చికిత్సపొందుతూ వ్యక్తి..
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన అగ్గు రమేశ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. రమేశ్ (32) గత కొన్నిరోజులుగా మానసిక పరిస్థితి బాగా లేక ఆసుపత్రులకు వెళ్లినా నయం కాలేదు. తరచూ చనిపోతాను అంటూ తెలి పేవాడు. ఊత్కూరు శివారులోని తన పొలం వద్ద గురువారం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి కుటుంబీకులకు విషయం చెప్పాడు. వెంటనే ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాలుడి అదృశ్యం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. భాగ్యనగర్ కాలనీకి చెందిన పసుపులేటి అనిల్–చంద్రికలకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు అశ్విన్ (3) ఉదయం ఇంటికి ఎదురుగా ఆడుకుంటుండగా శనివారం ఉదయం 11 గంటల నుంచి కనిపించడం లేదు. ఆచూకీ కోసం వెతికిన దొరకకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ నైలు నాయక్ తెలిపారు.


