కొత్త ప్లాంటు పనులు వేగంగా చేపట్టాలి
జైపూర్: ఎస్టీపీపీ విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న మూడో యూనిట్(800) మెగావాట్ల ప్లాంటు పనులు వేగవంతంగా చేపట్టాలని సింగరే ణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) ఎం.తిరుమలరావు తెలిపా రు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. కొత్త ప్లాంటు నిర్మిస్తున్న ప్రాంతాన్ని, పనులు పరిశీలించి బీహెచ్‌ఈఎల్, పవర్‌మేక్ కంపెనీ అధికారులతో మాట్లాడారు. ప్లాంటు ప్రస్తుత స్థితిగతులను అధికారులు మ్యాప్ ద్వారా ఆయనకు వివరించారు. అక్కడ ని ర్మించిన సైట్ ఆఫీసు, ఫస్ట్ ఎయిడ్, రక్షణ విభాగంతోపాటు వివిధ ఏజెన్సీల ఆఫీసులను సందర్శించారు. ఎస్టీపీపీ ఆవరణలో తాత్కాలిక భవనంలో వచ్చే ఏడాది నుంచి స్కూల్ ప్రారంభోత్సవానికి చేపడుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్ తదితరులు ఉన్నారు.


