అక్కా,తమ్ముడు అదుర్స్..
దండేపల్లి: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో దండేపల్లికి చెందిన అక్కాతమ్ముడు ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సంతపురి అహల్య, ఒలింపియాడ్‌లో ఇదే పాఠశాలలో చదివే ఆమె తమ్ముడు అలెగ్జాండర్(8వ తరగతి) ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న అక్కా, తమ్ముడిని హెచ్‌ఎం మల్లూరి శ్రీనివాస్, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు బండారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజశేఖర్, అనిత, సల్మా, లచ్చన్న, నరేందర్ అభినందించారు.


